ఆర్ జీ కె లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు .



ఆర్ జీ కె లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు .

 మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు బహుజన పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు. బుడగ జంగాల నాయకులు. ఎస్సీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొని త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు.

 ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు కల్లూరు జై చంద్ర మాట్లాడుతూ అనాడు మన మహానీయులు స్వాతంత్ర పోరాటంలో కుల మత బేధాలు లేకుండా ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగాలు చేసి తెల్లదొరల మీద పోరాడి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టారని ఆయన అన్నారు.

 బహుజన నాయకులు దాసరి యోబు మాట్లాడుతూ ఆనాడు మహాత్మా గాంధీ.సుభాష్ చంద్రబోస్. రానా ప్రతాప్.ఝాన్సీ లక్ష్మీబాయి. వల్లభాయ్ పటేల్. జవహార్ లాల్ నెహ్రూ. అల్లూరి సీతారామరాజు. బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆజాద్ లాంటి మహానీయులు లేకుంటే ఈరోజు స్వాతంత్రం వచ్చి ఉండేది కాదని ఆయన తెలిపారు. ఈరోజు మన భారత రాజ్యాంగం ప్రకారం మన భారతదేశంలోని అగ్రకులాలకు పేద బడుగు బలహీన వర్గాలకు మైనార్టీ వర్గాలకు ప్రతి ఒక్క మానవాళికి సమానత్వం ఉండాలనే నేపథ్యంలో ఆయన రాజ్యాంగం రాశారని ఆయన అన్నారు.

 అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరు జయ చంద్ర ప్రతిజ్ఞ చేయించారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post