ప్రజాసేవలో కమిషనర్ రమణబాబుకు గుర్తింపు.


 ప్రజాసేవలో కమిషనర్ రమణబాబుకు గుర్తింపు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

 ఉత్తమ సేవలకు ప్రశంసా పత్రం

 మార్కాపురం జిల్లా గిద్దలూరు పురపాలక సంఘ కమిషనర్ ఈ.వి. రమణబాబు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలకు గుర్తింపుగా జిల్లా కలెక్టర్ విజయ సునీత చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.

 ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో

గిద్దలూరులో కమిషనర్ రమణబాబు ప్రజలకు అందుబాటులో ఉంటూ, పురపాలక సంఘ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మెరుగైన సేవలు అందిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవను అధికారులు, ప్రజలు అభినందిస్తున్నారు.

 సేవలకు ప్రభుత్వం గుర్తింపు

ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూ అంకితభావంతో పనిచేస్తున్న రమణబాబు సేవలను గుర్తించిన ప్రభుత్వం ప్రశంసా పత్రంతో సత్కరించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఆయనకు మరిన్ని ఉన్నత పురస్కారాలు రావాలని ఆకాంక్షించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post