ఆగష్టు 31న ముఖ్యమంత్రి చేతుల మీదుగా వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల.


 ఆగష్టు 31న ముఖ్యమంత్రి చేతుల మీదుగా వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల.

భారీ బహిరంగ సభా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

5 కి.మీ. పొలాల్లో పర్యటించి పార్కింగ్ స్థలాలను పరిశీలించిన ఉన్నతాధికారులు.

మార్కాపురం, 25.8.26

ఈ నెల 31వ తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయనున్న శుభసందర్భంగా, దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద ముఖ్యమంత్రి గారి పర్యటన మరియు బహిరంగ సభా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గురువారం పరిశీలించారు.

ముఖ్యమంత్రి బహిరంగ సభా స్థలాన్ని, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

పార్కింగ్ స్థలాలకు సంబంధించిన సరైన ఏర్పాట్లను ప్రత్యక్షంగా సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు స్వయంగా పొలాల గుండా సుమారు 5 కిలోమీటర్ల మేర పర్యటించారు.

ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఫీడర్ కెనాల్ పనులను, క్రషర్ గేట్ల బిగింపు ప్రక్రియను అత్యంత వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించిన వేదిక, విఐపి/సాధారణ ప్రజల గ్యాలరీలు, తాగునీరు, పారిశుధ్యం తదితర పనులను తక్షణమే ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఎర్రగొండపాలెం తెదేపా ఇంచార్జి ఎరిక్షన్ బాబు, వెలుగొండ ప్రాజెక్ట్ సూపరింటెండింగ్ ఇంజనీర్ అబుతాలిం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post