కాశిబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస ఆగష్టు 15 :
పలాస నియోజకవర్గం కాశిబుగ్గ మున్సిపల్ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారు పాల్గొని జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విధి నిర్వహణలో అంకితభావంతో, బాధ్యతాయుతంగా సేవలందించిన మున్సిపల్ ఉద్యోగులను గుర్తించి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డులను ఎమ్మెల్యే గౌతు శిరీష గారు అందజేశారు. ఉద్యోగుల సేవలను అభినందిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
అలాగే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు, ఇతర పోటీదారులకు బహుమతులను ఎమ్మెల్యే గౌతు శిరీష గారు అందజేసి అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, క్రీడలు ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గౌతు శిరీష గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, నియోజకవర్గ ముఖ్య నాయకులు కూటమి నాయకులు స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

