శిశు సంక్షేమ సేవల్లో ఉత్తమ సేవలకు గుర్తింపుగా జిల్లాకలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సిడిపిఓ కుమారి.


 శిశు సంక్షేమ సేవల్లో ఉత్తమ సేవలకు గుర్తింపుగా జిల్లాకలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సిడిపిఓ కుమారి.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లాశిశు సంక్షేమ శాఖలో అంకితభావంతో అందిస్తున్న సేవలకు గుర్తింపుగా బేస్తవారిపేట సీడీపీఓ కుమారి ఉత్తమ సీడీపీఓ అవార్డును అందుకున్నారు.

 మార్కాపురంలోని ఎస్‌వీకేపీ కళాశాలలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు.

బేస్తవారిపేట పరిధిలో శిశు సంక్షేమ కార్యక్రమాల అమలులో కుమారి చురుకైన పాత్ర పోషిస్తూ, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సంక్షేమ సేవల పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు శిశు సంక్షేమ పథకాలను అర్హులైన వారికి చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ సేవల నాణ్యతను మెరుగుపరిచేందుకు కృషి చేశారు.

చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక సంరక్షణతో పాటు మహిళలు, శిశువుల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఆమె చూపిన చొరవకు ఈ పురస్కారం లభించింది. విధి నిర్వహణలో బాధ్యత, అంకితభావం, సమన్వయంతో పనిచేస్తూ శాఖకు మంచి పేరు తీసుకురావడంలో కుమారి కీలకంగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా సీడీపీఓ కుమారి మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ఉత్తమ సీడీపీఓగా ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ విజయ సునీతకు, ఇన్‌చార్జి పీడీ పద్మావతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో శిశువులు, మహిళల సంక్షేమం కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.

కుమారి సాధించిన ఈ పురస్కారం పట్ల శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్థానికులు అభినందనలు తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post