ఏపీటీపీసీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.



 ఏపీటీపీసీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం ప్రతినిధి శంకర్ తమ్మినాన.

మంగళగిరి: ఏపీటీపీసీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు వందనం చేశారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వజ్జ బాబురావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భర్ భారతదేశ నిర్మాణానికి ఐక్యంగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

రాష్ట్రంలో వాణిజ్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు ఏపీటీపీసీ మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సంస్థ అధికారులు, సిబ్బంది ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంకితభావంతో విధులు నిర్వహించాలని కోరారు.

కార్యక్రమంలో ఏపీటీపీసీ ఎండీ, వైస్ చైర్మన్ శేఖర్ బాబు, జనరల్ మేనేజర్ హనుమా నాయక్, మేనేజర్ ప్రసాద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post