అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించిన పుష్పశ్రీవాణి.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినేని
పలాస ఆగష్టు 17:
మాజీ మంత్రి, వైకాపా నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజును, ఆయన కుటుంబ సభ్యులను మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా అప్పలరాజు అరెస్టుకు దారితీసిన రోడ్డు ప్రమాద ఘటనపై ఆమె మాట్లాడారు.
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అప్పలరాజు కుమారుడు అత్యవసర సేవలకు ఫోన్ చేసి సహాయం అందించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ ఘటనను రాజకీయ కక్షతో తీవ్రమైన కేసుగా చిత్రీకరించి అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పుష్పశ్రీవాణి సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సీదిరి అప్పలరాజు కుటుంబానికి అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

