గుండ్రెడ్డిపల్లి గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించిన కొమరోలు పోలీసులు.



 గుండ్రెడ్డిపల్లి గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించిన కొమరోలు పోలీసులు.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రజలకు రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, దొంగతనాలపై అవగాహన

మార్కాపురం జిల్లా కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జె. రామకోటయ్య ఆధ్వర్యంలో కొమరోలు, రాచర్ల ఎస్‌ఐలు మరియు సర్కిల్ సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ గుండ్రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, ప్రజలతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.

అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, సందేశాలకు స్పందించవద్దని సూచించారు. గ్రామాల్లో దొంగతనాల నివారణకు అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో ఇటువంటి తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని సర్కిల్ ఇన్స్పెక్టర్ జె రామకోటయ్య గ్రామ ప్రజలకు తెలియజేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post