మానవత్వం చాటిన క్లాస్‌మేట్స్.



 మానవత్వం చాటిన క్లాస్‌మేట్స్.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినేని.

పలాస,వజ్రపుకొత్తూరు ఆగష్టు 17 : 

మండలం సీతాపురం గ్రామానికి చెందిన పోలాకి మురళీమోహన్‌ లివర్‌ సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరు అయిన ఆయన అనారోగ్యంతో మంచాన పడటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఈ విషయం తెలుసుకున్న నగరంపల్లి జడ్‌పీహెచ్‌ఎస్‌లో 1990–96 మధ్య చదువుకున్న ఆయన క్లాస్‌మేట్స్‌ మానవత్వంతో ముందుకొచ్చి తలో కొంత సాయం అందించారు. సీతాపురంలో మురళీమోహన్‌ కుటుంబాన్ని కలిసి రూ.25 వేల నగదు అందజేశారు. అలాగే కింతల తారకేశ్వరరావు (ఎక్స్‌ ఆర్మీ) రూ.6 వేల విలువైన నిత్యావసర సరుకులను అందించారు.

ఈ కార్యక్రమంలో ఎన్. మోహనరావు, బి. లక్ష్మీపతి, జగదీశ్వరి, తారకేశ్వరరావు, కృష్ణ, ముకుంద తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post