మహిళలు, బాలికల రక్షణకు అభయ పిర్యాదుల పెట్టులు ఏర్పాటు.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి ఆగష్టు :05
చోడవరం పట్టణంలో మహిళలు మరియు బాలికల భద్రతను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో చోడవరం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత చోడవరం పాఠశాలలో అభయ పిర్యాదుల పెట్టును ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో చోడవరం పోలీస్ స్టేషన్ సి.ఐ. పి. అప్పలరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జిఎంఎస్కే సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి.ఐ.పి. అప్పలరాజు మాట్లాడుతూ, ప్రతి పాఠశాల మరియు కళాశాలలో అభయ పిర్యాదుల
పెట్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులు తమకు ఎదురయ్యే వేధింపులు, ఇబ్బందులు లేదా ఇతర సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను గోప్యంగా ఈ బాక్స్‌లో నమోదు చేయవచ్చని, వాటిని పోలీసులు పరిశీలించి తక్షణమే స్పందించి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వివరించారు.
అలాగే విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలు ఎలాంటి వేధింపులు, ఇబ్బందులు లేదా నేరాలకు గురైనప్పటికీ భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 మరియు మహిళా హెల్ప్‌లైన్-181 సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినుల్లో భద్రతా అవగాహన పెంపొందించడంతో పాటు, సమస్యలను నిర్భయంగా తెలియజేసే వాతావరణం కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
