హెచ్‌ఐవీపై అవగాహన కార్యక్రమం.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినేని.
పలాస ఆగష్టు 17 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో దిశా ట్రక్కర్స్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సోమవారం మందస పట్టణ సంత, ప్రభుత్వ జూనియర్ కళాశాల పలాసలో విస్తృత సమాచార, విద్యా ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ ఎం. మాధవరావు ప్రచార మార్గాల ద్వారా హెచ్‌ఐవీ నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. సలహాదారు ఎన్. నాగభూషణం హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెచ్‌ఐవీపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన పొందడంతో పాటు, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని కళాశాల ప్రిన్సిపాల్ సూచించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు, దిశా ట్రక్కర్స్ ప్రాజెక్ట్ సిబ్బంది, ఆరోగ్య విద్య, ప్రచార విభాగాల సిబ్బంది, బారువా సమగ్ర సలహా, పరీక్షా కేంద్రం సలహాదారు తదితరులు పాల్గొన్నారు.

