మార్కాపురం జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు.



 మార్కాపురం జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

వెట్టి విమోచన కోయిలేషన్ జిల్లా కన్వీనర్ ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత గారిని మర్యాదపూర్వకంగా కలిసిన స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధులు. మార్కాపురం డివిజన్ కన్వీనర్ ఆది మూలపు అనిల్ రాజ్ లూకా. డాక్టర్ శ్రీ లక్ష్మి. దున్న యోబు. నందిగామ సుస్మిత. దాసరియోబు.

జులై 30వ తేదీన వెట్టి విమోచన మార్కాపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి కార్యక్రమాలకు మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత గారిని ప్రత్యేక ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వెట్టి విమోచన కోయిలేషన్ కన్వీనర్ నంది నాగయ్య కలెక్టర్ గారికీ వివరిస్తూ జిల్లాలోని అధికారులు మరియు వెట్టి విమోచన కమిటీ స్వచ్ఛంద సేవ సంస్థలతో సమావేశం నిర్వహించి.

మానవ అక్రమ రవాణా బానిస కార్మిక వ్యవస్థ రక్షణ పునరావాసం. మరియు చట్టపరమైన చర్యల పురోగతిని సమీక్షించడం. అవగాహన కార్యక్రమాలు గ్రామాలలో స్కూలు పాఠశాలలు బస్టాండ్లు రైల్వేస్టేషన్లో మార్కెట్లు ఇతర బహిరంగ ప్రదేశాలలో ఐ ఈ సి మెటీరియల్ ద్వారా అవగాహన కల్పించడం.

 వలస నివారణ బాలల అక్రమ రవాణా వెట్టి చాకిరి చట్టం 1970 బాల కార్మికుల వ్యవస్థ బాల్య వివాహాల మరియు సహాయ సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం.

 పాంప్లేట్ గోడ పత్రికల ద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా డిజిటల్ ప్రచారం ద్వారా సందేశాలు ఫోటోలు వీడియోలు విజయగాధలు మరియు హెల్ప్ లైన్ వివరాలను విస్తృతంగా ప్రచారం చేయడం మార్కాపురం జిల్లాలోని ఇరవై ఒక్క మండలాలలో స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రసార కార్యక్రమాలు నిర్వహిస్తామని వెట్టి విమోచన కొలియేషన్ జిల్లా కన్వీనర్ నంది నాగయ్య కలెక్టర్ గారికి తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post