పంట కాలువ కబ్జాచేసిన ఘనుడు.




 పంట కాలువ కబ్జాచేసిన ఘనుడు.

  ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రజా ధర్బార్ లో జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యే కు ఫిర్యాదు* రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో44.5 సెంట్ల భూమి ఉండగా ఆన్లైన్ లో 45.5 సెంట్లు ఎక్కించుకుని పంట కాలువ కబ్జా.

మార్కాపురం జిల్లా కంభం కంభం మండల కేంద్రంలో ని ఉదయగిరి బృందావనం ఫంక్షన్ హాలు లో ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా ప్రజా ధర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ లో ప్రజలు తమ భూ సమస్యలను జిల్లా కలెక్టర్ విజయ సునీత,నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కి వివరించుకున్నారు.రావిపాడు రెవిన్యూ ఇలాకాలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 387 లో రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ ప్రకారం విస్తీర్ణం 44.5 సెంటు పొలం మరియు 0.1 సెంటు స్థలం లో పంట కాలువ ఉండగా, రీ సర్వే లో ఆన్లైన్ నందు 45.5 సెంట్లు గా నమోదు చేయించుకుని షేక్. జిలాని పంట కాలువను పూర్తిగా మూసివేసాడు. గత 20 రోజుల నుండి జిలాని మరియు అతని కుటుంబ సభ్యులు పలు మార్లు పంట కాలువ మూసి వేసి కబ్జా చెశారని ఆ పొలాన్ని సర్వే చేయించి, 45.5 సెంట్ల పొలము నుండి ఒక సెంటు పంట కాలువను సదరు అధికారులు చూయించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత కు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కు బాధితుడు షేక్.లియాఖత్ అలీ ఫిర్యాదు చేశారు.వరి వేసుకుంటున్న సందర్బంలో పంట పొలాలకు నీళ్లు వెళ్లకుండా ఇలా దౌర్జన్యముగా మూసి వేయడం పై ఫిర్యాదు చేయడం పై ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ స్పందించి ఏమ్మెర్వో తో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని తెలిపారు..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post