ఏలూరు MLA గన్ మాన్ పై FIR.
* పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న ఏలూరు ఎమ్మెల్యే గన్ మాన్.
* సామాన్యుడికి ఒక రకమైన న్యాయం - అధికారం ఉన్నవారికి ఒక న్యాయం.
* చట్ట విరుద్ధమైన పనులకు ఏలూరు ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తారా...?
* ఎఫ్ఐఆర్ నమోదయి వారం రోజులు గడుస్తున్నా... క్రమశిక్షణ చర్యలు శూన్యం.
ఏలూరు, ఏప్రిల్ 6. క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు జిల్లా... ఏలూరు నియోజకవర్గానికి చెందిన జిల్లా పార్టీ ఇంచార్జ్ మరియు ఎమ్మెల్యే గన్ మాన్ చట్ట విరుద్ధమైన నిర్వాకం. గౌరవ పరమైన ఒక ఎమ్మెల్యే దగ్గర గన్ మాన్ గా పనిచేస్తూ.. MLA కి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కి తల వంపులు తీసుకువచ్చే విధంగా చట్టాన్ని గౌరవించని ఏలూరు నియోజకవర్గ MLA గన్ మాన్ శనపతి శ్రీ ఆంజనేయులు ARPC2735/13. తేదీ.28/03/2026 న స్థానిక భీమడోలు స్టేషన్ పరిధిలో కొందరు పేకాట నిర్వహిస్తున్నారు అనే సమాచారంతో పోలీసులు పేకాట నిర్వహిస్తున్న శిబిరంపై దాడి చేసి కొందరిని అదుపులోకి తీసుకొని FIR విధించడం జరిగింది. భీమడోలు పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులలో ఏలూరు ఎమ్మెల్యే గన్ మాన్ శ్రీ ఆంజనేయులు ప్రధాన సూత్రధారిగా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేకపోతే పేకాట నిర్వహిస్తున్న నిర్వాహకులపై పోలీస్ రైడ్ మీడియా ముందు ఎందుకు గోప్యంగా ఉంచారు..?
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఏ ఆర్ కానిస్టేబుల్ ఏలూరు ఎమ్మెల్యే గన్ మాన్ గా సాయుధుడై బాధ్యతాయుతమైన విధి నిర్వహణలో ఉన్న వ్యక్తి చట్టాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా పేకాట శిబిరాలు నిర్వహిస్తు... పట్టుబడిన వారం రోజులు గడిచినా ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం వెనక స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయనేది ప్రజల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. చట్టం కేవలం సామాన్యుడికే వర్తించదు అందరికీ సమానం... అని... గౌరవ ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ మరియు జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా...? లేక చట్ట విరుద్ధ కార్యకలాపాలకు వీరు సైతం మద్దతు ఇస్తారా...? అనేది ప్రజలు ఎదురుచూస్తున్నారు.
.jpg)