క్రైమ్ 9మీడియా కధనానికి స్పందించిన ఏలూరు ఎం ఎల్ ఏ మరియు జిల్లా ఎస్ పి.
ఏలూరు, ఏప్రిల్ 7,క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్ .
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గన్ మెన్ పై ఆరోపణ నేపధ్యంలో
గన్ మెన్ పై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు రుజువు అవ్వటంతో MLA బడేటి చంటి జిల్లాఎస్పీ కి ఫోన్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోమని చెప్పటం జరిగింది.
పోలీస్ శాఖలో ఉంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా సరే, కఠిన చర్యలు తప్పవని ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐ.పి.ఎస్. గారు హెచ్చరించారు.
భీమడోలు పరిధిలో పేకాట ఆడుతూ పట్టుబడిన ఏ.ఆర్. కానిస్టేబుల్‌ను విధులనుండి సస్పెండ్ చేస్తూ ఎస్పీ గారు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.
భీమడోలు ఎస్.ఐ. శ్రీ షేక్ మదీనా బాషా గారికి అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు, భీమడోలు పరిధిలోని ఒక పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న వ్యక్తులతో పాటు, ఏలూరు జిల్లా ఏ.ఆర్. విభాగానికి చెందిన కానిస్టేబుల్ ఎస్. ఆంజనేయులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీనితో భీమడోలు పోలీస్ స్టేషన్‌లో సదరు కానిస్టేబుల్‌పై మరియు ఇతరులపై కేసు నమోదు చేయడం జరిగింది.
శాంతిభద్రతలను కాపాడాల్సిన రక్షక భటుడే భక్షకుడిగా మారి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటాన్ని జిల్లా ఎస్పీ గారు తీవ్రంగా పరిగణించారు.
శాఖాపరమైన క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గాను కానిస్టేబుల్ ఆంజనేయులును తక్షణమే విధులనుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
.jpg)