డా. బాబు జగజ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరులో డా. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు, ఏప్రిల్, 5 : డా. బాబు జగజ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. డా. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు స్థానిక కలెక్టరేట్ లో ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ డా. బాబు జగజ్జీవన్ రామ్ పేదవర్గాల సంక్షేమానికి ఎంతో కృషిచేశారని, విలువలతో కూడిన రాజకీయ జీవితం గడిపారన్నారు. అంతటి మహనీయుని జీవితాన్ని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సమాజంలో అంటరానితనం, కులవివక్ష ను రూపుమాపేందుకు కృషిచేశారని, ఆయన చేసిన సేవలను ప్రజలలోనికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. డా. బాబు జగజ్జీవన్ రామ్ అందించిన స్పూర్తితో సమాజాభివృద్ధికి నేటి యువత కృషిచేయాలన్నారు.
కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి, షెడ్యూల్డ్ కులాల సంఘాల నాయకులు ప్రభృతులు పాల్గొన్నారు.
