రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదకర మలుపుల్లో కుంభాకార దర్పణాల ఏర్పాటు.



 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదకర మలుపుల్లో కుంభాకార దర్పణాల ఏర్పాటు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా పోలీస్ శాఖ పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రమాదాలు తరచుగా జరుగుతున్న ప్రదేశాలు, ముఖ్యంగా బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లో కుంభాకార దర్పణాలు (Convex Mirrors) అమర్చడం ద్వారా వాహనదారుల భద్రతను పెంచే దిశగా జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.,చర్యలు తీసుకున్నారు.

జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రప్రమాదకరమైన మలుపులు, జంక్షన్లు, టి.జంక్షన్,వై జంక్షన్, యు టర్న్, విజిబిలిటీ తక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు సులభంగా కనిపించేలా కుంభాకార దర్పణాలు (Convex Mirrors) పై సైన్ బోర్డు కనిపించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ దర్పణాలు వాహనదారులకు ముందస్తు అవగాహన కల్పించి, ప్రమాదాలను నివారించడంలో ఏంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.

ఈ దర్పణాలను సరైన విధంగా ఎలా అమర్చాలి, వాటి ఎత్తు, కోణం, స్థాన ఎంపిక వంటి అంశాలపై పోలీస్ అధికారులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డెమో కార్యక్రమముని గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలిపారు. ఈ డెమోలో ట్రాఫిక్ నిర్వహణలో పాటించాల్సిన ప్రమాణాలు, రోడ్డు భద్రతకు సంబంధించిన ముఖ్య సూచనలు వివరించబడినాయి. ఫీల్డ్‌లో పనిచేసే అధికారులకు ప్రాక్టికల్‌గా చూపిస్తూ, దర్పణాల సరైన వినియోగంపై పలు సూచనలు అందించారు.

ప్రమాదాలను పూర్తిగా నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, జిల్లా పోలీస్ శాఖ తీసుకుంటున్న ఈ చర్యలకు ప్రజల సహకారం కూడా అవసరమని తెలిపారు. 

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, వేగ నియంత్రణ పాటించడం, మలుపులు వద్ద జాగ్రత్తగా వాహనాలు నడపడం, రోడ్డు పరిస్థితులను గమనించడం వంటి అంశాలను కచ్చితంగా అనుసరించాలని సూచించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post