భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు. సిలువను మోసిన సంఘ పాస్టర్.


 భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు. సిలువను మోసిన సంఘ పాస్టర్. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

 మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం పాపనేపల్లి  గ్రామంలో  తెలుగు బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులు విశ్వాసుల భక్తి శ్రద్ధల తో  ప్రార్థనలు చేసారు,

గత 40 రోజులుగా ఉపవాస ప్రార్థనలు నిర్వహించి ఈ రోజు గ్రామం లోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ దగ్గర నుంచి చర్చి సంఘ కాపరి పాస్టర్  కె  జాన్ గారు  గ్రామ పుర వీధులలో సిలువను మోస్తూ మానవాళి పాప పరిహారం కోసం సిలువపై ప్రాణ త్యాగం చేసిన గొప్ప దైవం ఏసుక్రీస్తు అని కొనియాడుతూ క్రీస్తు చూపించిన కరుణ మరియు క్షమాపణ గుణము ప్రతి ఒక్కరూ అలవర్చుకొని ఉండాలని పాస్టర్ జాన్ పాల్ తెలిపారు,

 గ్రామ శివారులో  ఉన్న ఒలీవ కొండ వరకు సిలువను మోయటం జరిగింది .  

ఈ సందర్భంగా  కుల మతాలకు అతీతంగా గ్రామం లోని హిందు, ముస్లిం సోదరులు కలిసి ఉపవాసం తో ఉన్న క్రైస్తవ సోదరులందరికీ మజ్జిగ పంపిణీ చేశారు . ఈ కార్యక్రమం లో పాపినేనిపల్లె తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ పెద్దలు, ఒలివల కొండ యూత్,  మహిళలు, యవనస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post