యువతకు అధునాతన నైపుణ్య శిక్షణ అందించే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలి.



 యువతకు అధునాతన నైపుణ్య శిక్షణ అందించే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలి.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా యువతకు అధునాతన నైపుణ్యాలను అందించేందుకు జిల్లా స్థాయిలో అడ్వాన్స్‌డ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ను, ప్రఖ్యాతిగాంచిన సెంచూరియన్ యూనివర్సిటీతో కలిసి ఏర్పాటు చేయడం మరియు ఆ కేంద్రంలో అందించాల్సిన అడ్వాన్స్‌డ్ స్కిల్ కోర్సులపై శనివారం ప్రకాశం భవనంలో కలెక్టర్ .పి.రాజాబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ, సెంచూరియన్ యూనివర్సిటీ ప్రతినిధులు ఆశిష్ మోడీ ( స్కిల్ డెవలప్మెంట్ విభాగ అధిపతి ), డాక్టర్ డి.ఎన్. సత్యనారాయణ, గ్రామ్ తరంగ్ టెక్నాలజీస్ ఎం.డి. బాబూశంకర్ పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో జిల్లా యువతకు ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్‌డ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా అందించగల కోర్సులు, అవసరమైన మౌలిక వసతులు, శిక్షణా విధానాలు మరియు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించే అంశాలపై విస్తృతంగా చర్చించారు.

 ఈ అడ్వాన్స్‌డ్ స్కిల్ సెంటర్ ద్వారా మైనింగ్ , గ్రీన్ ఎనర్జీ, సోలార్, డ్రోన్స్, లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి సెక్టార్స్ లో యువతకు ఉన్నత స్థాయి శిక్షణ అందించి పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశం ద్వారా జిల్లా యువతకు అధునాతన నైపుణ్య శిక్షణ అందించే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు,

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post