మార్కాపురం జిల్లాలో రెండో సాధారణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి..
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత వెల్లడి.
జిల్లాలో తక్షణమే అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి.
రాజకీయ పార్టీల ప్రాతిపదికన పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికల నిర్వహణ.
ఎంపీటీసీ ఎన్నికలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు.. జెడ్పీటీసీ ఎన్నికలకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు.
అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ.
అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన.. 25న అప్పీళ్లకు అవకాశం.
అక్టోబర్ 26న అప్పీళ్ల పరిష్కారం.. 27న నామినేషన్ల ఉపసంహరణకు గడువు.
నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.
నవంబర్ 4న అవసరమైతే రీపోలింగ్.. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.
నవంబర్ 11, 12 తేదీల్లో ఎంపీపీ, జెడ్పీపీ చైర్పర్సన్ల ఎన్నికకు ప్రత్యేక సమావేశాలు.
జిల్లాలో మొత్తం 21 జెడ్పీటీసీ స్థానాలు.. 21 ఎంపీపీ స్థానాలు.
జిల్లావ్యాప్తంగా 274 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ.
జిల్లాలో మొత్తం ఓటర్లు 7,46,030 మంది.
ఓటర్లలో పురుషులు 3,77,161 మంది.. మహిళలు 3,68,843 మంది.. ఇతరులు 26 మంది.
జిల్లాలో మొత్తం 982 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.
435 సాధారణ పోలింగ్ కేంద్రాలు.. 287 సమస్యాత్మక కేంద్రాలు.. 260 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు.
ఎన్నికల నిర్వహణ కోసం సిద్ధంగా 1,187 బ్యాలెట్ బాక్సులు.
పోలింగ్ విధుల కోసం రిజర్వ్ సిబ్బందితో కలిపి మొత్తం 5,401 మంది నియామకం.
ఎన్నికల పర్యవేక్షణకు 65 మంది జోనల్ అధికారులు.. 132 మంది రూట్ అధికారులు.
ఎంపీటీసీ నామినేషన్లు సంబంధిత ఎంపీపీ కార్యాలయాల్లో.. జెడ్పీటీసీ నామినేషన్లు జిల్లా పరిషత్ కార్యాలయంలో స్వీకరణ
జిల్లా పరిషత్ కార్యాలయంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు, ఎలక్షన్ సెల్స్ ఏర్పాటు
దివ్యాంగ ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ కేంద్రాల వద్ద వీల్చైర్ల ఏర్పాటు
ఎన్నికల నియమావళి అమలుపై నిఘా ఉంచనున్న ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు
ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేందుకు అందరూ సహకరించాలి: కలెక్టర్ ఎం. విజయ సునీత.
