గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో డీజే నిర్వాహకులతో ప్రకాశం జిల్లా పోలీసుల సమావేశం నిబంధనలపై అవగాహన.





 గణేష్‌ ఉత్సవాల నేపథ్యంలో డీజే నిర్వాహకులతో ప్రకాశం జిల్లా పోలీసుల సమావేశం నిబంధనలపై అవగాహన. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

డీజే సౌండ్‌ సిస్టమ్‌ వినియోగంలో పరిమితులు పాటించాలి – ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవాలకు సహకరించాలి

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో డీజే సౌండ్‌ సిస్టమ్‌ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

రాబోయే గణేష్‌ ఉత్సవాలు, వినాయక విగ్రహాల ఊరేగింపుల నేపథ్యంలో డీజే సౌండ్‌ సిస్టమ్‌ల వినియోగానికి సంబంధించిన నిబంధనలు, పరిమితులపై నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు చేశారు.

అధిక శబ్దంతో డీజే సౌండ్‌ సిస్టమ్‌లను వినియోగించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వం మరియు పోలీస్‌ శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌కు, ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా వ్యవహరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని డీజే నిర్వాహకులకు సూచించారు.

ప్రశాంతమైన గణేష్‌ ఉత్సవాలు ప్రజల భద్రత, సౌకర్యమే మా లక్ష్యం.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post