పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి ఎం ఈ ఓ.
రివ్యూ మీటింగ్ నిర్ణయాల అమలుపై క్షేత్రస్థాయి పరిశీలన.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం మండలంలోని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, పదో తరగతి ఫలితాల మెరుగుదల, ప్రభుత్వ విద్యా కార్యక్రమాల అమలు తదితర అంశాలపై ఎంఈవో అబ్దుల్ సత్తార్ ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరు 100 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని, మూడు రోజులకు మించి గైర్హాజరైన విద్యార్థుల ఇళ్లను సందర్శించి గైర్హాజరుకు గల కారణాలను తెలుసుకోవాలని, నెలకు మించి పాఠశాలకు రాని విద్యార్థుల విషయంలో పూర్తి వివరాలు సేకరించిన అనంతరం డ్రాప్‌బాక్స్‌లో నమోదు చేయాలని, తిరిగి పాఠశాలకు వచ్చినప్పుడు విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.విద్యార్థులు వలస వెళ్లిన సందర్భాల్లో వారు నివసిస్తున్న ప్రాంతంలోని పాఠశాలలో చేర్పించేలా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలని తెలిపారు.
8వ తరగతి విద్యార్థుల్లో అత్యధిక మంది ఎన్ఎంఎంఎస్ పరీక్షకు హాజరయ్యేలా ప్రోత్సహించాలని, ఎన్ఎంఎంఎస్ యాక్షన్ ప్లాన్‌ను ప్రతి పాఠశాలలో అమలు చేస్తూ గత ప్రశ్నపత్రాలను రివ్యూ చేయించాలని, ప్రతిరోజూ పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.విద్యార్థులందరూ లీప్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేలా ప్రోత్సహించాలని, విద్యాశక్తి కార్యక్రమాన్ని ప్రతి ఉన్నత పాఠశాలలో తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. పాఠశాలలకు సరఫరా చేసిన క్లిక్కర్లను సక్రమంగా వినియోగించాలని, అవి పనిచేయని సందర్భంలో సంబంధిత గ్రూపులో సమాచారం తెలియజేయాలని సూచించారు. విద్యాశక్తి కార్యక్రమంలో ప్రసారమయ్యే వీడియోలను విద్యార్థులు ఏ మేరకు అర్థం చేసుకుంటున్నారో పరిశీలించి, వారానికి ఒకసారి పరీక్ష నిర్వహించి వారి అభ్యసన స్థాయిని సమీక్షించాలని తెలిపారు.
నిర్మాణాత్మక పరీక్ష మార్కులను 100 శాతం ఆన్లైన్లో నమోదు చేయాలని, పదో తరగతి విద్యార్థుల కోసం ‘మిషన్ మార్చ్ 2027’లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు రెమిడీయల్ బోధన నిర్వహించాలని సూచించారు. స్లిప్ టెస్టులు నిర్వహించి వాటి ఫలితాలను వారానికి ఒకసారి సమీక్షించాలని తెలిపారు. షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్ విద్యార్థులకు వారి స్థాయికి అనుగుణంగా వేర్వేరు ప్రశ్నపత్రాలను రూపొందించి పరీక్షలు నిర్వహించాలన్నారు
ప్రతి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా 8 పీరియడ్లు బోధించాలని, పాఠశాల ప్రారంభంలో నిర్వహించిన రెడీనెస్ కార్యక్రమంలో ప్రీ టెస్ట్, పోస్ట్ టెస్ట్ నిర్వహణపై పరిశీలన చేయాలని ఎంఈవో సూచించారు. పదో తరగతిలోని షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్ విద్యార్థుల సంఖ్యను పాఠశాలల వారీగా తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల పనితీరును ప్రధానోపాధ్యాయులు నిరంతరం పరిశీలించి సరైన నివేదిక రూపొందించుకోవాలని, ప్రశస్త్ యాప్‌లోని అన్ని వీడియోలను ఉపాధ్యాయులు తప్పనిసరిగా వీక్షించాలని చెప్పారు.
అనంతరం పలు పాఠశాలల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ
రివ్యూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఏ మేరకు అమలవుతున్నాయో తెలుసుకున్నారు.జంగంగుంట్ల జడ్పీ ఉన్నత పాఠశాల, వాసవి విద్యానికేతన్, ఆల్ఫా ఉన్నత పాఠశాల, కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, బోధన–అభ్యసన ప్రక్రియ, విద్యాశక్తి కార్యక్రమం అమలు, పదో తరగతి విద్యార్థుల అభ్యసన స్థాయి, రెమిడీయల్ బోధన, పరీక్షల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. అమలులో సమస్యలు ఉన్నచోట సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు చేశారు.
రివ్యూ సమావేశంలో ఇచ్చిన ఆదేశాలను కేవలం సమావేశానికే పరిమితం చేయకుండా పాఠశాల స్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని, హాజరును, పదో తరగతి ఫలితాలను మెరుగుపరచాలని ఎంఈఓ అబ్దుల్ సత్తార్ సూచించారు.


