గంగమ్మ ఒడిలోకి బయలుదేరిన విగ్నేశ్వరుడు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
మార్కాపురం జిల్లా కంభం మండల కేంద్రంలో ఈరోజు వినాయకుని భక్తులు ప్రజలు అంగరంగ వైభవంగా డప్పు వాయిద్యాలతో ఊరేగింపుతో శ్రీకృష్ణ దేవరాయులు సతీమణి శ్రీ మతి వరదరాజమ్మగారు కట్టించిన ఆసియా ఖండంలో పెద్ద రెండవ చెరువు గా గుర్తింపు పొందిన కంభం చెరువు లో నిమజ్జనం చేయటానికి భక్తులు ప్రజలు తండోప తండాలుగా తరలివచ్చి ఆ మహా దేవుడు విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో సాగనంపారు.
అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కంభం లో 30 40 సంవత్సరాల నుండి పోలీసుల బందోబస్తు నడుమ ఊరేగింపులో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసుల పర్యవేక్షణలో చర్చి మసీదుల దగ్గర పటిష్ట బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ మరియు గిద్దలూరు రూరల్. అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు.స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. పోలీస్ ఫోర్సును ప్రతి 20 అడుగులకు పది మంది చొప్పున బందోబస్తు నిర్వహించారు.
రాత్రి 12 గంటలైనా నిమజ్జనం పూర్తి కాలేదు. నిమజ్జండ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి భక్తులు ప్రజలు విజ్ఞేశ్వరుని చూసి సంతోషం వ్యక్తం చేశారు.

