కంభం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ క్రీడా మైదానాన్ని అడ్డాగా మార్చుకున్న మద్యం ప్రియులు.
చర్యలు తీసుకోవాలని వాకర్ల డిమాండ్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ క్రీడా మైదానం మద్యం సేవించే వారికి అడ్డాగా మారిందని వాకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం ఏదో ఒక సందర్భంలో కొందరు వ్యక్తులు క్రీడా మైదానంలో మద్యం సేవిస్తూ కాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, అక్కడే పడేసి వెళుతున్నారు . మరికొందరు ఖాళీ మద్యం సీసాలు పగలగొట్టి అక్కడే వేస్తున్నారు.
అక్కడికి వచ్చే పాదచారులు, వాకింగ్ చేసే వారు, వ్యాయామం చేసేవారికి ఇబ్బందులు కలుగుతుందని వాపోతున్నారు
విద్యార్థులు, క్రీడాకారులు, వాకర్లు ఉపయోగించాల్సిన మైదానంలో మద్యం సేవించడం వల్ల అసౌకర్యంతో పాటు పరిసర వాతావరణంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని వాకర్లు పేర్కొన్నారు.
ఇప్పటికైనా మైదానంలో మద్యం సేవించే వారిపై పోలీస్ అధికారులు నిఘా పెంచి, చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని వాకార్లు కోరుతున్నారు.
అధికారులు, పోలీసులు స్పందించి క్రీడా మైదానంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వాకర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
