ప్రభుత్వ పాఠశాలల్లో నవోదయ కోచింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత యం పి పి స్కూల్లో.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
పాఠశాల సమయం తర్వాత విద్యార్థులకు గంటపాటు ఉచిత శిక్షణ.
మార్కాపురం జిల్లా: బెస్తవారిపేట.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు భవిష్యత్తులో మంచి అవకాశాలు అందించేందుకు ప్రత్యేకంగా నవోదయ ప్రవేశ పరీక్షకు కోచింగ్ అందిస్తున్నారు.
బేస్తవారిపేట ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల సమయం పూర్తయిన అనంతరం విద్యార్థులకు ప్రతిరోజూ సుమారు గంటపాటు ఉచితంగా నవోదయ కోచింగ్ నిర్వహిస్తున్నారు.
విద్యార్థులకు కఠినమైన అంశాలను సైతం సులభంగా అర్థమయ్యే భాషలో వివరించడంతో పాటు, ప్రశ్నలను ఎలా అర్థం చేసుకోవాలి.. సమాధానాలను ఎలా గుర్తించాలి అనే అంశాలపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
నవోదయ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు ఎంతో అంకితభావంతో శిక్షణ అందిస్తున్నారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రైవేట్ కోచింగ్ భారం లేకుండా ప్రభుత్వ పాఠశాలలోనే ఉచితంగా ఈ శిక్షణ అందించడం అభినందనీయమని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యతో పాటు నవోదయ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఉచిత శిక్షణ అందించడం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా మారుతోంది..

