ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి ఎం సి పి ఐ (యు ) డిమాండ్.


 ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి ఎం సి పి ఐ (యు ) డిమాండ్.

తెలంగాణా.మేడ్చల్ క్రైమ్ 9మీడియా ప్రతినిధి యోబు.

మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం కేంద్రంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనం సుధాకర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం అవుతున్న అసెంబ్లీ సమావేశాల్లో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రపై చర్చించాలి.

కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో అమలు లో బాగంగా ఆరు గ్యారంటీ ల అమలు పై చర్చించాల

తెలంగాణ లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై, కరువు పై, కరెంట్ కోతలపై, మంచినీటి సమస్యపై చర్చించాలి

యంసిపిఐ (యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి డిమాండ్ 

సెప్టెంబర్ 7 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రాముఖ్యత పై చర్చించి హైదరాబాద్ లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు అందించటానికి కావాల్సిన అద్యన కేంద్రం ఏర్పాటు చేయాలని, ఆ పోరాటం లో లేవి గల్లాలకు వ్యతిరేకంగా, వెట్టిచాకిరి కి వ్యతిరేకంగా నాటి నైజాం దేశముకులకు వ్యతిరేకంగా మొదట ఆయుధం పట్టి చివరికి కింద పెట్టిన ఐదు ఎన్నికల విజేతగా అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు కు గెలిచి ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వీర తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహణ లో అగ్రగణ్యుడు గా నిలిచి చిట్యాల అయిలమ్మ ఆత్మగౌరవం ను ఎత్తి పట్టిన కామ్రేడ్ భీం రెడ్డి నరసింహ రెడ్డి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించటానికి సూర్యాపేట జిల్లా కు బియన్ జిల్లా గా, అక్కడి కలెక్టరేట్ కు, భీం రెడ్డి నరసింహ రెడ్డి పేరు పెట్టాలని, ట్యాంక్ బండ్ పై విగ్రహం పెట్టాలని, వారి జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించటానికి విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లో నిర్మాణం చేయుట కు ఐదు ఎకరాల స్థలం కెటాయించాలని, అలాగే మరో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఐదు సార్లు అసెంబ్లీ కి వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి గెలుపొందిన అసెంబ్లీ టైగర్ అని ప్రజల చే నామకరణం చేయబడ్డ మద్ది కాయల ఓంకార్ జీవిత చరిత్రను, పోరాట చరిత్రను తెలంగాణ మట్టి బిడ్డ గా భవిష్యత్ తరాలకు అందించటానికి వారి స్మారక చిహ్నాలు ఏర్పాటు, విజ్ఞాన కేంద్రం ఏర్పాటు కు హన్మకొండ కాళోజీ కళాక్షేత్రం పక్క ఐదు ఎకరాల స్థలం, నర్సంపేట లు మినీ స్టేడియం కు ఓంకార్ పేరు, నర్సంపేట - వరంగల్ రహదారి కి ఓంకార్ పేరు పెట్టె విధంగా, ట్యాంక్ బండ్ పై విగ్రహం ఏర్పాటు చేసే విధంగా అసెంబ్లీ లో చర్చ చేపట్టాలని అన్నారు.

   అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీ చర్చించి ప్రజలకు జవాబుదారీ ప్రభుత్వం గా నిలువాలని గాదగోని రవి రాష్ట్ర ముఖ్యమంత్రి ని, రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తె ఆరు గ్యారంటీ లను అమలు చేస్తాం అని అందులో ప్రధానంగా చేయూత పేరు తో పెన్షన్లు ఉన్న 2000 రూపాయలు 4000 రూపాయల కు 

వికలాంగుల 4000 రూపాయల పెన్షన్ ను 6000 లకు పెంచుతాం అని అర్హులందరికీ చేయూత పెన్షన్లు ఇస్తాము అని, మహిళలందరికీ నెలకు వారి అకౌంట్ లో 2500 రూపాయలు వేస్తాం అని, కౌలు రైతులందరికీ నెల కు 12,000 రూపాయలు సహాయం చేస్తాం అని, ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 రూపాయలు ఇస్తాం అని ఇలా అనేక వాగ్దానాలు మిగిలి పోయిన తీరు, బిసిల కు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను, 7 వ గ్యారంటీ ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షణ హామీ విఫలం కావడం, శాంతి భద్రతలు అనేక జిల్లాల్లో హత్యలు దాడులు శాంతి భద్రతల పై అసెంబ్లీ లో చర్చించాలని యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.

ఎలినో ప్రభావం తో పర్యావరణ సమస్య తీవ్రతను గమనించి రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై, కరువు, మంచినీటి సమస్య, కరెంట్ కోతలు, ఆకాశం అంటుతున్న నిత్యావసర ధరలు, అవినీతి పై ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని, రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు దెబ్బ తిని కనీస సౌకర్యాలు లేక ప్రజలు అనేక అగచాట్లు పడుతున్న తీరు పై అసెంబ్లీ చర్చ అవసరం అని విలువైన ఈ సమావేశం దుర్వినియోగం కాకుండా ప్రజా సమస్యలు పక్క దారి పట్టకుండా ముఖ్యమంత్రి గారు తగు విధంగా చర్యలు చేపట్టాలని యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి డిమాండ్ చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post