పలు దేవాలయాలలో చోరిలకు పాల్పడుతున్న 13 మంది అరెస్ట్,


 పలు దేవాలయాలలో చోరిలకు పాల్పడుతున్న 13 మంది అరెస్ట్,

 రూ 22 లక్షల 70 వేల రూపాయల /- విలువ కలిగిన సొత్తును స్వాధీనం చేసుకున్న మార్కాపురం జిల్లా పోలీసులు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

కేసులను చేధించుటలో ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన మార్కాపురం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.,.

మార్కాపురం జిల్లా సియస్ పురం, పామూరు, కనిగిరి, కొనకరమెట్ల మండలాల్లో గల దేవాలయాలలో ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడిన నేరస్థుల అరెస్టు గురించి

   1) Cr.No.31/2026 u/s 331(4),305 (a) BNS of C.S. Puram Ps 

  2) Cr.No:99/2026 u/s 331(4), 303(2) BNS of Kanigiri PS

  3) Cr.No.53/2026 u/s 303 (2) BNS of కొనకానమిట్ల PS

  4) Cr.No. 84/2026 u/s 331(4), 305(a) BNS of Pamur PS

అరెస్ట్ చేయబడిన ప్రదేశము తేది:08.09.2026 ఈ క్రింది ముద్దాయిలను పామూరు మండలం, రావిగుంటపల్లి గ్రామ శివారులో అరెస్ట్ చేయటం అయినది. 

ముద్దాయిల వివరాలు:

1.ఇండ్ల విష్ణువర్ధన్, తండ్రి పేరు వెంకటేశ్వర్లు, వయస్సు 28 సంవత్సరాలు, రావిగుంటపల్లి గ్రామం, పామూరు మండలం, మార్కాపురం జిల్లా. (A-1)

2. తమ్మిశెట్టి రమణయ్య, తండ్రి పేరు బాల గురవయ్య, వయస్సు 50 సంవత్సరాలు, సి.ఎస్.పురం గ్రామం, సి.ఎస్.పురం మండలం, మార్కాపురం జిల్లా. (A-2)

3. మల్లాల చెంచు సుబ్బారావు, తండ్రి పేరు బసవయ్య, వయస్సు 39 సంవత్సరాలు, ఏలూరుపాడు గ్రామం, గుడ్లూరు మండలం, ప్రకాశం జిల్లా. (A-3)

4. సోమరాజుపల్లి ఉమా మహేశ్వరరావు, తండ్రి పేరు సుబ్బారావు, వయస్సు 41 సంవత్సరాలు, పొదిలి పట్టణం, మార్కాపురం జిల్లా. (A-4), Suspect no 50 of Podili PS

5. కొమ్మ @ కొమ్మి కాటం రాజు, తండ్రి పేరు కొండయ్య, వయస్సు 33 సంవత్సరాలు, వంగపాడు గ్రామం, కనిగిరి మండలం, మార్కాపురం జిల్లా. (A-5)

6. బత్తుల శ్రీను, తండ్రి పేరు మాలకొండయ్య, వయస్సు 50 సంవత్సరాలు, సి.ఎస్.పురం గ్రామం, సి.ఎస్.పురం మండలం, మార్కాపురం జిల్లా. (A-6)

7. పిన్నీ రాజీవ్, తండ్రి పేరు కోటేశ్వరరావు, వయస్సు 22 సంవత్సరాలు, పల్లెపాలెం, కొత్తపట్నం గ్రామం మరియు మండలం, ప్రకాశం జిల్లా. (A-7)

8. కమ్మ సూర్యతేజ, తండ్రి పేరు అంజయ్య, వయస్సు 43 సంవత్సరాలు, తూర్పు కమ్మపాలెం, ఎన్.టి.ఆర్. విగ్రహం సమీపంలో, ఒంగోలు పట్టణం, ప్రకాశం జిల్లా. (A-8)

9. మోకా ఆంజనేయులు, తండ్రి పేరు అల్లిరావు, వయస్సు 42 సంవత్సరాలు, వినోదరాయునిపాలెం గ్రామం, ఎన్.జి.పాడు మండలం, ప్రకాశం జిల్లా. (A-9)

10 డేరంగుల వెంకట రమణ, తండ్రి పేరు వెంకటయ్య, వయస్సు 50 సంవత్సరాలు, అద్దంకి పట్టణం, ప్రకాశం జిల్లా. (A-10)

11 బండారు తిరుపతయ్య, తండ్రి పేరు వెంకటేశ్వర్లు, వయస్సు 45 సంవత్సరాలు, వడ్డేపాలెం, సి.ఎస్.పురం గ్రామం, సి.ఎస్.పురం మండలం, మార్కాపురం జిల్లా. (A-11)

12 దూదేకుల నాగూర్ షరీఫ్, తండ్రి పేరు ఖాదర్‌వలి, వయస్సు 41 సంవత్సరాలు, గిద్దలూరు పట్టణం, మార్కాపురం జిల్లా. (A-12)

13 చందాలూరి బాల గురవయ్య, తండ్రి పేరు పెద్ద గురవయ్య, వయస్సు 42 సంవత్సరాలు, భావాపురం గ్రామం, కొమరోలు మండలం, మార్కాపురం జిల్లా. (A-13) (Receiver)

దొంగిలించబడిన సొత్తు వివరాలు

1) సి. ఎస్.పురం శివాలయంలో సుమారు 12 లక్షల విలువ గల రెండు పార్వతీ పరమేశ్వరుల పంచలోహ విగ్రహాలు మరియు ఒక ఇత్తడి అయ్యప్ప విగ్రహం.

2) కనిగిరి మండలం చీరలదిన్నె గ్రామంలో గల కాశీ విశ్వేశ్వర స్వామి గుడిలో సుమారు 10,00,000/- రూపాయల విలువ గల 4.5 కేజీల వెండి కవచము మరియు వెండి నాగాభరణము.

3) కొనకనమిట్ల మండలం గొట్లగట్టు రామాలయంలో 25,000/- రూపాయల విలువగల సుమారు 25 కేజీల ఇత్తడి హనుమంత వాహనము. 

4) పామూరు మండలం వర్గం పల్లి గ్రామంలో పోలేరమ్మ తల్లి దేవాలయంలో సుమారు 50 వేల రూపాయల విలువ గల ఇత్తడి కిరీటము మరియు రెండు చేతుల కవచములు.

 మొత్తం విలువ: సుమారు 22,75,000/- రూపాయలు.

స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు.

1) సి.ఎస్.పురం శివాలయంలో సుమారు 12 లక్షల విలువ గల రెండు పార్వతీ పరమేశ్వరుల పంచలోహ విగ్రహాలు మరియు ఒక ఇత్తడి అయ్యప్ప విగ్రహం.

2) కనిగిరి మండలం చీరలదిన్నె గ్రామంలో గల కాశీ విశ్వేశ్వర స్వామి గుడిలో సుమారు 10,00,000/- రూపాయల విలువ గల 4.5 కేజీల వెండి ఆవరణములు కరిగించి పాత పోసిన నాలుగు వెండి గిన్నెలు.

3) కొనకనమిట్ల మండలం గొట్లగట్టు రామాలయంలో దొంగలించిన25 కేజీల ఇత్తడి హనుమంత వాహనము అమ్మగా వచ్చిన 20,000/- నగదు.

4) పామూరు మండలం వగ్గం పల్లి గ్రామంలో పోలేరమ్మ తల్లి దేవాలయంలో సుమారు 50 వేల రూపాయల విలువ గల ఇత్తడి కిరీటము మరియు రెండు చేతుల కవచములు. 

మొత్తం విలువ: సుమారు 22,70,000/- రూపాయలు మరియు 

1. ఎర్టిగా Car-1, తూఫాన్ Car-1, ద్విచక్ర వాహనాలు-2

కేసు వివరములు

ఈ ముద్దాయిలలో బేల్దారు పనులు, మరికొందరు స్లాబ్ మిల్లర్ పనులు చేస్తూ ఉంటారు. ఆయా పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ఒకరికొకరు పరిచయం ఏర్పడింది. వీరిలో విష్ణువర్ధన్ ఒక ప్రైవేట్ వెంచర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా, అతనికి సుబ్బారావు తోడుగా ఉండేవాడు. వీరిలో పాత నేరస్తుడైన సోమేపల్లి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఒక దేవాలయంలో పూజారిగా పనిచేస్తూ, దేవాలయాల్లో చోరీలకు పాల్పడి సులభంగా డబ్బు సంపాదించవచ్చనే సలహాలు ఇచ్చేవాడు. కొమరోలు మండలానికి చెందిన బాల గురవయ్య చోరీ చేసిన సొత్తును స్వీకరించే రిసీవర్‌గా ఉండేవాడు. ఈ విధంగా దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పలు దేవాలయాలను ముందుగా గుర్తించి, అక్కడి పరిస్థితులను పరిశీలిస్తూ, దొంగతనాలకు పాల్పడినారు.

ఇటీవల కాలంలో మార్కాపురం జిల్లా పరిధిలోని సి.ఎస్.పురం, పామూరు, కనిగిరి, కొనకనమిట్ల మండలాల్లోని పలు దేవాలయాలలో వరుసగా జరిగిన దొంగతనాలను దృష్టిలో ఉంచుకుని, మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఈ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ నిరంతర పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కనిగిరి డీఎస్పీ పి. శ్రీధర్ ఆధ్వర్యంలో పామూరు సీఐ డి. వినోద్ కుమార్, కనిగిరి సీఐ యు.శ్రీనివాసరావు, సి.ఎస్.పురం, వెలిగండ్ల, పామూరు, కొనకనమిట్ల, పిసీ పల్లి పోలీస్ స్టేషన్ల ఎస్ఐ లు వెంకటేశ్వర రెడ్డి, కోటేశ్వరరావు, అనూక్, శ్రీకాంత్, నరసింహారావు మరియు వారి సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, కేసులను వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడంతో పాటు, సాంకేతిక ఆధారాలను సేకరించి, ఆయా గ్రామాల్లో ఇన్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి వారి ద్వారా అందిన విశ్వసనీయ సమాచారాన్ని విశ్లేషిస్తూ ముందుకు సాగాయి. ఈ క్రమంలో ఈరోజు 08.09.2026 న పామూరు మండలం రావిగుంటపల్లి గ్రామ శివారులో పై దేవాలయ దొంగతనాలకు పాల్పడిన 13 మంది నిందితులను అరెస్టు చేశారు.

అరెస్టు చేసిన వారి వద్ద నుండి సుమారు రూ.22.70 లక్షల విలువైన పంచలోహ విగ్రహాలు, ఇత్తడి విగ్రహాలు, ఇత్తడి తొడుగులు మరియు వెండి దిమ్మలు,నగదు.20,000/-లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా, నేరాలకు ఉపయోగించిన ఒక తూఫాన్ వాహనం, ఒక ఎర్టిగా కారు మరియు రెండు మోటార్ సైకిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దేవాలయాల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. కెమెరాలకు సంబంధించిన DVRలను ఎత్తైన, భద్రమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అలాగే, సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని తరచూ పరిశీలిస్తూ, వాటి రికార్డింగ్ డేటా కొన్ని రోజులపాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవాలయాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద ఘటనలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు.

దేవాలయాలలో జరుగుతున్నఈ వరుస దొంగతనాలు దర్యాప్తును ఎస్పీ ప్రత్యేక పర్యవేక్షణలో కేసులు ఛేదించడంలో కృషి చేసిన కనిగిరి డిఎస్పి పి.శ్రీధర్ బాబు,పామూరు సిఐ డి.వినోద్ కుమార్, కనిగిరి సీఐ యు శ్రీనివాసరావు,ఎస్సైలను, వారి సిబ్బంది, సిసిఎస్ మరియు ఐటీ కోర్ సిబ్బందిలను మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., అభినందించినారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post