హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్.
వజ్రపుకొత్తూరు ఆగష్టు 08: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (APSACS) ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (DISHA) సహకారంతో డిషా ట్రక్కర్స్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళవారం గరుడభద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అక్కుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రజలకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాప్తి, నివారణ చర్యలు, అపోహలు–వాస్తవాలపై అవగాహన కల్పించారు. అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేలా ప్రోత్సహించారు. కరపత్రాలను పంపిణీ చేశారు.
డిషా ట్రక్కర్స్ ప్రాజెక్టు మేనేజర్ ఎం. మాధవరావు మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, తమకు తెలిసిన విషయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతరులకు తెలియజేసి అవగాహన పెంచాలని కోరారు. వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించి, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.
ఈ కార్యక్రమంలో డిషా ట్రక్కర్స్ ప్రాజెక్టు సిబ్బంది, పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అక్కుపల్లి పీహెచ్‌సీ వైద్యుడు, ఆశా కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

