బిసి ఎస్సి ఎస్టి మైనారిటీలంతా రాజ్యాధికారం సాధించాలి - ఐక్యవేదిక డిమాండ్.
ఏలూరు, సెప్టెంబర్ 25:క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ.
ఏలూరులో ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సీనియర్ దళిత బహుజన నాయకుడు నేతల రమేష్ బాబు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా మరియు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రిటైర్డ్ డిఐజి లంక వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ బీసీ ఎస్టీ మైనారిటీలంతా ఏకతాటిపై ఐక్యంగా ఉండి రాబోయే స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోటీ చేసి రాజ్యాధికారం సాధించాలని ఏలూరు నగర్ మేయర్ పదవిని బీసీ కులాలకు లేదా ఎస్సీ కులాలకు కేటాయించాలని కోరుతూ అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై అంబేద్కర్ గారి విగ్రహాలను అవమానపరుస్తున్న వారిపై తగు చర్యలు తీసుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలని బీసీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అక్టోబర్ మూడో తేదీన ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో గల డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్ లో భారీ సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సభకు అందరూ తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో నూకపెయ్యి సుదీర్ పల్లెం ప్రసాద్ కాపుదాసి రవి, ఉక్కుసూరి గోపాలకృష్ణ లక్కోజి గోపి సిహెచ్ బాబ్జి పి ఎస్ ఆర్ విటల్ పాము సామ్యుల్ ఇనపనూరి జగదీష్ శ్రీమతి చిలకపాటి డింపుల్ గొల్ల కిరణ్ చింతా మహాలక్ష్మడు కొల్లేరుసంఘ నాయకుడు కే వీ ఆర్ రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ కుల సంఘాల నాయకులు సుమారు 100 మంది పాల్గొన్నారు.
