కంబంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల.



 కంబంలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లాగిద్దలూరు నియోజకవర్గం కంబం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సెంటర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకను కూటమి నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు కేక్ కట్ చేసి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పంచిపెట్టారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మార్పుకోసం జనసేన పార్టీ పెట్టిన వ్యక్తి అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2014 లో పార్టీ స్థాపించి 12 సంవత్సరాల పాటు 2024 లో దూరంకరం, దౌర్జన్యం, పెత్తందారి వ్యవస్థలకు వ్యతిరేకంగా NDA కూటమితో భాగస్వామిగా తెలుగుదేశం, బీజేపీ, జెనసేన ఏర్పడి ఈ కూటమితోనే మార్పు వస్తుందని ప్రజా పరిపాలన గా ఉంటుంది అని ఆకాంక్షించిన వ్యక్తి 164 స్థానాలు ఇవ్వడం జరిగింది , చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి సుపరిపాలన అందిస్తున్నారు , 

పశ్చిమ ప్రకాశంగా ఉన్న జిల్లా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతో ఉంది అని రాష్ట్ర అభివృద్ధిలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పాత్ర అభినందనీయమని,

ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం కూటమి ప్రభుత్వం సమష్టిగా పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గం జనసేన ఇంచార్జీ బెల్లంకొండ సాయి బాబా,కంభం జనసేన మండలం పార్టీ అధ్యక్షుడు ప్రసాద్, నరిశెట్టి వీరమ్మ,కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post