దళితుల మీద దాడులను కండించిన హై కోర్ట్ అడ్వకేట్ గూడూరి వినోద్ కుమార్.
దోర్నాల మండలం చిన్న గుడిపాడు పల్లి గ్రామస్తులైన మాదిగ యువకుడి పై దాడి చేసి దుర్భాషలాడిన కమ్మ వారి పై దోర్నాల PS లో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు.
ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం లోని చిన్న గుడిపాడు పల్లకి చెందిన మాదిగ యువకుడు మాకం రాజశేఖర్ ని అదే గ్రామానికి చెందిన కమ్మ కులానికి చెందిన ఐనేని పెద్ద ఆంజనేయులు మరియు వడ్డెల్లి రాజా కృష్ణ అను వారు కులం పేరుతో దూషించి తీవ్రమైన పదజాలంతో తిడుతూ దాడి చేసిన విషయాన్ని తెలుసుకున్న మార్కాపురం జిల్లా దళిత నాయకులు ఫిర్యాదు చేయడంతో ఎస్సై గారు సానుకూలంగా స్పందించి SC ST POA ACT కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం జరిగినది.
మాదిగ యువకుడైన మాకం రాజశేఖర్ ను కులం పేరుతో అసభ్యకరమైన పదజాలంతో దూషించిన కమ్మ సామాజికవర్గానికి చెందిన ఐనేని ఆంజనేయులు మరియు వడ్డేల్లి రాజా కృష్ణ లో పై కేసు నమోదు చేయడంతో ఆగకుండా వారిని వెంటనే అరెస్టు చేయాలని హై కోర్ట్ అడ్వకేట్ గూడూరి వినోద్ కుమార్,మార్కాపురం సబడివిజన్ 1,విజిలెన్స్ కమిటీ మెంబెర్ అదమూలపు లూకా గారు, గూడూరి సాధనందము,2 మాజీ విజిలెన్స్ కమిటి మెంబెర్ గూడూరి మధు డిమాండ్ చేస్తూ ఒకవేళ ముద్దాయిలను అరెస్టు చేయడంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యం చేసినట్లయితే ** .నేషనల్ యస్సి కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్తాము అని హై కోర్ట్ అడ్వకేట్ గూడూరి వినోద్ కుమార్ ఒక ప్రకటన లో తెలియజేసారు
