మాదిగ యువకుడు మాకం రాజశేఖర్ పై దాడి చేసిన అగ్రకుల అహంకారులను కఠినంగా శిక్షించాలి.
-MRPS,రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి షాలేంరాజ్ డిమాండ్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా, దోర్నాల మండలం, చిన్నగుడిపాడు గ్రామానికి చెందిన దళిత యువకుడు మాకం రాజశేఖర్ (27) పై అగ్రకులానికి చెందిన వ్యక్తులు చేసిన దాడిని, కులం పేరుతో వేధింపులను ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తున్నాయి.
తేది 09.09.2026 న రాజశేఖర్ తన బైక్ పై వినుకొండ నుండి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన ఒక మహిళ లిఫ్ట్ అడగడంతో మానవతా దృక్పథంతో తీసుకువచ్చాడు. త్రిపురాంతకం వద్ద ఇనేని పెద్ద ఆంజనేయులు అనే వ్యక్తి బైక్ ను అడ్డగించి, "మా కులపు స్త్రీని నీ బైక్ పై ఎందుకు ఎక్కించుకున్నావు" అంటూ కులం పేరుతో అత్యంత నీచంగా దూషించి, బైక్ ను ధ్వంసం చేసి చేతులతో దాడి చేశాడు.
అంతటితో ఆగకుండా తేది 11.09.2026 న ఫోన్ లో, 12.09.2026 న నేరుగా ఇంటికి వచ్చి ఇద్దరు నిందితులు - ఇనేని ఆంజనేయులు, వడ్డెల్లి రాజా కృష్ణ ఇంటి తలుపులు తన్ని, కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషిస్తూ చంపుతాము అని బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ ఘటన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా, సమానత్వపు హక్కులకు విరుద్ధం. దళితుడు బైక్ నడపకూడదా? మానవత్వంతో ఒక మహిళకు లిఫ్ట్ ఇవ్వకూడదా? అని ప్రశ్నిస్తున్నాము.
నిందితులు ఇనేని ఆంజనేయులు, వడ్డెల్లి రాజా కృష్ణలను వెంటనే అరెస్ట్ చేసి, SC/ST అట్రాసిటీ యాక్ట్ మరియు BNS 351(3) కింద అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి.
బాధితుడు మాకం రాజశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించి, SC/ST యాక్ట్ ప్రకారం తక్షణ నష్టపరిహారం చెల్లించాలి
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దళితులపై పెరుగుతున్న దాడులను అరికట్టాలి. ఈ విషయాన్ని వైసీపీ శాసనసభ్యులు. తాటిపర్తి చంద్రశేఖర్ కూటమి నేత ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఏరిక్షన్ బాబు నైతిక బాధ్యత వహించాలని
బాధితునికి న్యాయం జరిగే వరకు ఎమ్మార్పీఎస్ దళిత సంఘాలు పోరాటం చేస్తాయి.
నిందితులను వెంటనే అరెస్ట్ చేయకపోతే, దోర్నాల పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నాం
ఈ కార్యక్రమం లో సింగా ప్రసాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నేదరపల్లి జయరాజ్ దారివేముల రమేష్ రెడ్డపోగు చిన్న గురవయ్య ఆదిమూలపు లూక యేసమ్మ.కువ్వారపు రాజు.గ్రామస్తులు బాధితులు తదితరులు పాల్గొన్నారు

