బేస్తవారిపేటలో భారీ అగ్నిప్రమాదం ఆస్తి నష్టం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండల కేంద్రమైన బేస్తవారిపేట గాంధీ బజార్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుడు మట్టా వెంకట శేషారావు ఇంట్లో ఏసీ (AC) రిపేర్ పనులు చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి
గ్యాస్ లీక్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లోని బెడ్‌రూమ్, మధ్య హాలు, వంటగది తీవ్రంగా దెబ్బతిన్నాయి. బెడ్, బీరువాలోని బట్టలు, సీలింగ్ (POP), ఫర్నిచర్‌తో పాటు ఇంట్లోని విలువైన వస్తువులు, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి.
అగ్నిప్రమాదం ధాటికి ఇంటి గోడలు, పైకప్పు, విద్యుత్ వైరింగ్ తదితరాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
దీంతో బాధిత కుటుంబానికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది.
ఇంట్లోని సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతి కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా నివారించగలిగారు.
అయితే అప్పటికే ఇంట్లోని పెద్ద మొత్తంలో సామగ్రి కాలిపోయి, భారీ ఆస్తి నష్టం సంభవించింది.
ఏసీ రిపేర్ సమయంలో గ్యాస్ లీక్ కావడమే అగ్నిప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది.

