AP విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ టి. రవీంద్ర గారికి వినతిపత్రం.


 AP విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ టి. రవీంద్ర గారికి వినతిపత్రం.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో సదరం సహాయక కేంద్రం (హెల్ప్ డెస్క్) లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగుల వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులు.

రెగ్యులర్ ఉద్యోగులు విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరిన నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్. కాలేషా...

ఈ సందర్భంగా వినతి పత్రాన్ని ఇచ్చి ప్రెస్ నోట్ విడుదల చేసిన కాలేశా.

ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో సదరం సహాయక కేంద్రం (హెల్ప్ డెస్క్) లో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగుల వలన జీవితకాల వైకల్య ధ్రువీకరణ పత్రలకు (సదరం సర్టిఫికెట్) భద్రత లేకుండా పోయింది. అక్కడికి వస్తున్న దివ్యాంగులకు సరైన సమాచారం ఇవ్వకుండా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెబుతున్నారు. బాధ్యత లేకుండా రోజూ వారి విధులను సరిగా చేయకుండా దివ్యాంగులను పలుమార్లు తిప్పించుకుంటున్నారు. ఈ విషయాలను ఒంగోలు రిమ్స్ వైద్యశాల సూపర్డెంట్ ఎన్. మాణిక్యరావు దృష్టికి తీసుకువెళ్లిన కాలయాపన చేస్తున్నారని ప్రకాశం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ చర్యలు లేవు. అసలే దివ్యాంగులు సుదూర ప్రాంతాల నుండి ఎవరో ఒకరి సహాయంతో వచ్చి పదే పదే తిరగాలంటే ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే కదా... ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు కావటం వలన బాధ్యత లేకుండా పోయింది. వెంటనే దీనిపై ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి పై విషయాలను తీసుకుని వెళ్లి రెగ్యులర్ ఉద్యోగులను ఒంగోలు రిమ్స్ వైద్యశాలలోసదరం సహాయక కేంద్రం (హెల్ప్ డెస్క్)లో రెగ్యులర్ ఉద్యోగుల చేత విధులు నిర్వహించాలని కోరుకుంటున్నాము. 

మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వ వైద్యశాలలో లేనివిధంగా ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో ఒక కొత్త నిబంధన పెట్టడం జరిగింది. సాధారణంగా దివ్యాంగులు ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకొని సంబంధిత వైద్యశాలకు వచ్చి ఓ.పి. నమోదు చేసుకొని సంబంధిత వైకల్యం ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటారు. కానీ ఇక్కడ దివ్యాంగులు వచ్చి మొదట సదరం సహాయక కేంద్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల దగ్గర నమోదు చేపించుకొని వెళ్లాలని నిబంధన పెట్టటంతో ఇది దివ్యాంగులకు శారీరక శ్రమను కలగజేయడంతో పాటు అక్కడ ఉన్న కొంతమంది దానిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని తెలిసింది. ఇలాంటివి పునరావృతం కాకుండా డైరెక్టర్ , ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పై విషయాలను తెలియజేసి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post