చట్టం సామాన్యులకేనా..!పోలీసులకు వర్తించదా...?


 చట్టం సామాన్యులకేనా..!పోలీసులకు వర్తించదా...?

 ఏలూరులో పేకాట ఆడుతూ పట్టుబడిన రాజమండ్రిMT వింగ్ కానిస్టేబుల్ ARPC అల్లం జనార్ధన రావు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

 భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు గడిచిన చట్టాలు కేవలం సామాన్యులకు మాత్రమే వర్తిస్తాయి అధికారులపై కాదు అనే విధంగా పలు అనుమానాలకు దారి తీసే విధంగా వ్యవహరిస్తున్న అధికారులు.

 ఏలూరు వన్ టౌన్ పరిధిలో పేకాట నిర్వహిస్తున్నారని అందిన సమాచారంతో పోలీసులు వారికి అందిన సమాచారం ప్రకారం ఏలూరు వన్ టౌన్ పరిధిలో గల పాత వేరుశనగ ఫ్యాక్టరీ పై దాడి చేయగా పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా కొందరిని అదుపులోకి తీసుకున్న ఏలూరు వన్ టౌన్ సీఐ. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో రాజమండ్రి కి చెందిన MT వింగ్ ARPC 2736 అల్లం జనార్ధన్ అను ఏఆర్ కానిస్టేబుల్ పై కూడా ఏలూరు వన్ టౌన్ లో ఎఫ్ఐఆర్ విధించడం జరిగింది. 16/08/2026 న ఏ ఆర్ కానిస్టేబుల్ అల్లం జనార్ధన పై ఎఫ్ఐఆర్ జరిగినా నేటికీ 22/08/2026. పేకాట ఆడుతూ పట్టుబడినటువంటి ఎఫ్ఐఆర్ విధించబడినటువంటి ఏఆర్ కానిస్టేబుల్ పై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి... స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు గడిచిన చట్టం కేవలం సామాన్యులకు మాత్రమే వర్తిస్తుంది అధికారులపై వర్తించకపోవడం పై ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని ఆ సాంఘిక కార్యకలాపాలు నియంత్రించడంలో ప్రత్యేకంగా ఉండవలసిన పోలీసులే పేకాట ఆడుతూ పట్టు పడడంపై పోలీసు వ్యవస్థలోని క్రమశిక్షణ చర్యలు ఏ విధంగా ఉంటున్నాయో... ఉన్నత స్థాయి అధికారులు వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని... అసాంఘిక కార్యకలాపాలలో పోలీసులే భాగస్తులుగా ఉండడంపై ప్రజలలో పోలీసు వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post