కంబాలరాయుడుపేటలో నూతన హెల్త్ సెంటర్ ప్రారంభం.
రూ.20 లక్షల నరేగా నిధులతో నిర్మాణం – గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్.
పలాస ఆగష్టు24:
వజ్రపుకొత్తూరు మండలం కంబాలరాయుడుపేట గ్రామంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మించిన నూతన హెల్త్ సెంటర్‌ను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధులు రూ.20 లక్షలతో ఈ భవనాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నూతన హెల్త్ సెంటర్ అందుబాటులోకి రావడంతో కంబాలరాయుడుపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు స్థానికంగానే వైద్య సేవలు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు.
ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన వైద్య, మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పుచ్చ ఈశ్వరరావు, కర్ని రమణ, గోవింద పాపారావు, దానేష్, వాసు, రామారావు, డీఈతో పాటు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, గ్రామస్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

