పూల సుబ్బయ్య వెలిగొండ జలాల విడుదల – గిద్దలూరు నియోజకవర్గంలో రైతుల పండగ వాతావరణం.




పూల సుబ్బయ్య వెలిగొండ జలాల విడుదల – గిద్దలూరు నియోజకవర్గంలో రైతుల పండగ వాతావరణం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు 

స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల

ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గo వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి.

ఈ రోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బేస్తవారిపేట Y జంక్షన్ నుండి కంబం పట్టణంలోని కందులాపురం సెంటర్, కాలేజ్ రోడ్డు మీదుగా గచ్చు కాలువ వరకు పెద్ద ఎత్తున భారీ ట్రాక్టర్ ర్యాలీని స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీ నీ ప్రారంభించారు


ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ప్రజల, రైతాంగపు దశాబ్దాల నాటి కల నెరవేరుతున్న చారిత్రాత్మక ఘట్టం ఆసన్నమైంది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను ఎన్నడూ లేని విధంగా వేగవంతం చేశారు.


నాడు ఇదే వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే, మళ్లీ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఈనెల 31 వ తేదీన వెలిగొండ జలాలను జాతికి అంకితం చేస్తూ విడుదల చేయనుండటం ఎంతో శుభపరిణామం. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వెలిగొండ నిర్వాసితుల కష్టాలను గుర్తించి, వారికి తగిన నష్టపరిహారాన్ని అందజేసి ఆదుకున్న ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది.


ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని, వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరువు ప్రాంతాలైన మన ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతా భావంతో గిద్దలూరు నియోజకవర్గంలో విశేష వేడుకలు నిర్వహించనున్నం.


ఈ ర్యాలీ కార్యక్రమంలో కూటమి భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) నాయకులు, కార్యకర్తలు, నాయకత్వాలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, రైతులు మరియు నియోజకవర్గ ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీ లో పాల్గొన్నారు
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post