బాల భవిత కేంద్రంలో చిన్నారులకు ఉపకరణాల పంపిణీ.



బాల భవిత కేంద్రంలో చిన్నారులకు ఉపకరణాల పంపిణీ. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ లోని జిల్లా బాల భవిత కేంద్రంలో జిల్లా వైద్య శాఖ వారి ఆధ్వర్యంలో ఎనిమిది లక్షల రూపాయలు ఖరీదైన పరికరాలు ఒమేగా రిహబిలిటేషన్ ఫౌండేషన్ బెంగళూరు వారి ఆర్థిక సహకారంతో 18సంవత్సరాల లోపు చిన్నారులకు ఆర్థోటిక్స్,ప్రాస్థటిక్స్,వీల్ చైర్లు, ట్రై సైకిల్స్, పంపిణీ ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి గారిచేతుల మీదుగా పంపిణీచేయబడినవి.

ఈ సభకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టీ . వెంకటేశ్వర్లు గారు అధ్యక్షత వహించారు. జిజిహెచ్ సూపర్నెంట్ డాక్టర్ మాణిక్యరావు , డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ ఎన్ కిరణ్, ఆర్ ఎం ఓ డాక్టర్ మాధవి లత,జిల్లాRBSK NCD ప్రోగ్రాం అధికారి డాక్టర్ జి. భగీరథ.మరియు రిమ్స్ ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ ప్రభాకర్, చిన్నారుల నిపుణులు డాక్టర్ తిరుపతి రెడ్డి. డాక్టర్ భాషా. డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఏడుకొండలు తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. ఒమేగా రిహాబిలిటేషన్ ఫౌండేషన్ వారు నిర్వాహకులు దినేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా మేము సైతం ఫౌండేషన్ నిర్వాహకులు జనసేన నాయకులు శ్రీను అధితిగా పాల్గొన్నారు.

జెసి కల్పనాకుమారి మాట్లాడుతూ ఈ చిన్నారులకు ప్రభుత్వం నుంచి మరింత సహాయ సహకారాలు అందజేస్తామని అంటూ వీరిలో ఇంకా మానసిక అంగవైకల్యం ఉన్నవారికి అదే విధంగా గుండె జబ్బులు కలిగిన వారికి తగు వైద్య సహకారాలు అందించాలని వైద్యులను కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ అంగవైకల్యం కలిగిన చిన్నారులకు పెన్షన్లు శాంక్షన్ చేయుటకు గాని వారికి వైద్య చికిత్సలు అందించటం కానీ వైద్యులు ఎప్పుడు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేశారు.

ప్రోగ్రాం అధికారి డాక్టర్ జి భాగీరథి మాట్లాడుతూ ఒమేగా రిహాబిలిటేషన్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఇచ్చిన పరికరాలు సుమారుగా 8 లక్షల రూపాయలు ఖరీదు అని ఇవి గ్రామాల్లో సైతం క్యాంపులు నిర్వహించి తల్లిదండ్రులకు చిన్నారులకు సహకరిస్తామని తెలియజేశారు 

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంగవైకల్ విభాగం అడిషనల్ డైరెక్టర్ సువార్త , జిల్లా వైద్యారోగ్య శాఖ డి ఈ ఎం ఓ. బి నరసింహారావు గారు జిల్లా బాల భవిత కేంద్రము వైద్యులు మరియు ఫిజియోథెరపిస్టు శ్రీ సునీత సిబ్బంది పాల్గొని సహకరించారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post