ఏఐవైఎఫ్ జండా ఆవిష్కరించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.




 ఏఐవైఎఫ్ జండా ఆవిష్కరించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.

ఏ ఐ వై ఎఫ్ మహబూబ్ నగర్ జిల్లా సమితి సమాజ అభివృద్ధి కి మూలం యువతే.

యువతతో కయ్యమాడేతే కాలగర్భంలో కలవాల్సిందే.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఎం బాల నరసింహ.

విద్యా వైద్య ఉపాధి హక్కులకై సమరశీల పోరాటాలకు సిద్ధం అవుదాం నేర్లకంటి శ్రీకాంత్ ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.

 సమాజ తలరాత సమూలంగా మార్చే శక్తి ఒక్క యువతకు మాత్రమే ఉన్నదని ఎం.నరసింహ అన్నారు.

అఖిలభారత యువజన సమాఖ్య మహబూబ్నగర్ జిల్లా 13వ మహాసభలు గురువారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సురవరం వెంకట్రామారెడ్డి భవన్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా శాంతి అభ్యుదయం శాస్త్రీయ సోషలిజం ఆశయాలు గల ఏఐవైఎఫ్ జెండాను ఆవిష్కరించారు. 

మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎం.బాల నరసింహ మాట్లాడుతూ:- యువత ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వివక్ష ధోరణి ప్రదర్శిస్తూ యువతతో కయ్యం పెట్టుకున్న ఏ పాలక ప్రభుత్వాలకు, ఎంతటి వారినైనా కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి యువతను ఉద్దేశించి పొద్దింకలతో పోలిస్తే బొద్దింకల పేరుతోనే చరిత్రపుటల్లో నిలిచిపోయే దేశంలో విరోచిత పోరాటానికి మోడీ సర్కారు తలవంచక తప్పలేని దుస్థితి నెలకొన్నదని గుర్తు చేశారు.

80 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో నేటికి నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని వేట రెండు కోట్ల ఉద్యోగాలతో అధికారంలో వచ్చిన మోడీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన హామీని విస్మరించి భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులను ప్రాదేశిక సూత్రాలకు భంగం కలిగేలా ఫాసిస్ట్ విధానాలను అనుసరించడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు కలంకమని అన్నారు. 60 శాతం పైగా దేశంలో యువత ఉన్నదని కానీ యువత శక్తి యుక్తులను సక్రమ మార్గంలో పెట్టడంలో పాలకులు విఫలం చెందారని అన్నారు. దశాబ్దాల పాటు భారతదేశానికి పంచవర్ష ప్రణాళిక ఎంతో గేటు రాయిగా ఉండేదని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికలను రద్దుచేసి వాటి స్థానంలో మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిపై దేశద్రోహులుగా, విదేశాంగ విధానానంపై మాట్లాడితే విదేశీ భక్తులుగా, మత ఉన్మాదంపై ప్రశ్నిస్తే హిందూ వ్యతిరేకులుగా , భారత రాజ్యాంగ హక్కులు అడుగుతే నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్ల టెర్రరిస్టులుగా అబండాలు మోపటమే మోడీ పంచవర్ష ప్రణాళికలుగా మార్చుకున్నారని మండిపడ్డారు.

రామరాజ్యం జపం చేసే అధికారంలోకి వచ్చిన మోడీ రాముని కానుకలు దోచుకుంటున్నారని అన్నారు. 

యువత చెడు అలవాట్లకు లోనవ్వకుండా రాజకీయాల్లోకి వచ్చి దోపిడి రహిత సమాజ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర వహించాలని పిలుపునిచ్చారు. 

  ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్. శ్రీకాంత్ మాట్లాడుతూ:- విద్య వైద్యం ఉపాధిలు అందని ద్రాక్షగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నూతన విద్య పాలసీతో విద్యను అంగడి సరుకుగా మార్చి విద్యారంగంలో కాషాయకరణ అమలు చేస్తూ భారతదేశ చరిత్ర పుటలను ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ త్ విష బీజాలను నాటుతున్నారని మండిపడ్డారు. విద్యా వైద్య ఉపాధి హక్కులకై సమరసిల పోరాటాలకు యువతి యువకులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8న యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల సందర్భంగా యువజన కవాత్ నిర్వహిస్తున్నామని 9 10 తేదీలలో ప్రతినిధుల సభలు జరగతాయని యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు. 

   ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బృంగి బాలకిషన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బిజ్జా శ్రీనివాస్, ఏఐవైఎఫ్ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి పి.సురేష్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ రాము, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు, ఏఐవైఎఫ్ జిల్లా కో కన్వీనర్ మహేష్, నాయకులు లక్ష్మణ్, విరేష్, రమేష్, సిద్దార్థ్, నరేందర్ నరహార బస్వరాజు, నరేష్,శివ, హైమ, వరలక్ష్మి, విజయ,మహిళ సమాఖ్య జిల్లా నేత ఇందిరా తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post