పంచాయతీ అభివృద్ధి అధికారుల శిక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన కలెక్టర్.


 పంచాయతీ అభివృద్ధి అధికారుల శిక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన కలెక్టర్. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

రాయవరంలో శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న విజయ సునీత.

మార్కాపురం జిల్లా, మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామపంచాయతీ పరిధిలోని, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద నిర్వహిస్తున్న జిల్లా స్థాయి పంచాయతీ అభివృద్ధి అధికారుల శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ విజయ్ సునీత ఆకస్మికంగా సందర్శించి, మీ మీ గ్రామ పంచాయతీలలో పాజిటివ్ పర్సెప్షన్ తక్కువ ఎందుకు వస్తుందని ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని గ్రామపంచాయతీ రిక్షాలు ప్రతిరోజు, ప్రతి ఇంటికి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని, తడి చెత్త పొడి చెత్త వేరుచేసి ఇచ్చే విధానాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని శిక్షణ కార్యక్రమం కు హాజరైన పంచాయతీ అభివృద్ధి అధికారులకు మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలియజేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post