రోడ్డు భద్రతకు మరో అడుగు ప్రమాదకర మలుపుల్లో కన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేసిన జిల్లా పోలీసులు.


 రోడ్డు భద్రతకు మరో అడుగు ప్రమాదకర మలుపుల్లో కన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేసిన జిల్లా పోలీసులు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కీలక చర్యలు చేపట్టారు. ప్రమాదకర మలుపులు, బ్లైండ్ స్పాట్స్ ఉన్న ప్రాంతాల్లో కన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేశారు.

ఈ మిర్రర్ల ద్వారా ఎదురుగా వచ్చే వాహనాలను ముందుగానే గమనించేందుకు డ్రైవర్లకు సహాయపడుతుందన్నారు . ముఖ్యంగా ఇరుకైన రహదారులు, మలుపులు మరియు స్పష్టత లేని ప్రాంతాల్లో ఈ మిర్రర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ చర్యలు చేపట్టారని అధికారులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.

రోడ్డు భద్రత కోసం మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post