సమగ్ర శిక్ష – ప్రకాశం జిల్లా
కేజీబీవీ ప్రవేశాల గడువు ఏప్రిల్ 10 వరకు పొడిగింపు సమగ్ర శిక్ష ఉమ్మడి ప్రకాశం జిల్లా.
ఉమ్మడి క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో (KGBVs) 2026–27 విద్యా సంవత్సరానికి గాను 6వ మరియు 11వ తరగతులలో ప్రవేశాలు, అలాగే 7, 8, 9, 10 మరియు 12వ తరగతులలో మిగిలిన సీట్ల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 1, 2026తో ముగిసినది.
విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును ఏప్రిల్ 10, 2026 వరకు పొడిగించినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, ఐఏఎస్ వెల్లడించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాజెక్ట్ అధికారి అనిల్ కుమార్ దాసరి గారు తెలిపిన వివరాల ప్రకారం, ప్రకాశం జిల్లాలో 1445 ఖాళీలు, మార్కాపురం జిల్లాలో 1815 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
అనాథలు, బడి బయట ఉన్న బాలికలు, డ్రాపౌట్స్, పేద, ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ మరియు బి.పి.ఎల్ వర్గాలకు చెందిన బాలికలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తులు మాత్రమే పరిగణించబడతాయని తెలిపారు.
దరఖాస్తులు https://apkgbv.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చు. ఎంపికైన విద్యార్థులకు SMS ద్వారా సమాచారం అందించబడుతుంది. సంబంధిత పాఠశాల నోటీస్ బోర్డుల్లో కూడా వివరాలు అందుబాటులో ఉంటాయి.
ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే 7993329115, 7075039990 నంబర్లను పని వేళల్లో (ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు) సంప్రదించవచ్చని తెలిపారు,
