జి జి హెచ్ ని సందర్శించిన జిల్లా రెవెన్యూ అధికారి.



 జి జి హెచ్ ని సందర్శించిన జిల్లా రెవెన్యూ అధికారి. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

జిల్లా రెవెన్యూ అధికారి బి. సిహెచ్. చిన ఓబులేసు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిజీహెచ్ సుపరింటెండెంట్ లతో కలసి శుక్రవారం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రి (జిజిహెచ్)ని సందర్శించి రోగులకు అందిస్తున్న వసతులు, పారిశుధ్య ఏర్పాట్లను, డంపింగ్ యార్డ్ నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యశాల ఆవరణలో రోగులకు అందిస్తున్న వసతులు, ఉన్న సైడు మురుగు కాలువల నిర్వహణ, పారిశుధ్య ఏర్పాట్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ సూచనలతో ఈ రోజు జిజిహెచ్ ను సందర్శించి రోగులకు అందిస్తున్న వసతులు, పారిశుధ్య ఏర్పాట్లను, డంపింగ్ యార్డ్ నిర్వహణ, పరిశీలించడం జరిగిందని, దీని పై జిల్లా కలెక్టర్ వారికి నివేదిక ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 

జిల్లా రెవెన్యూ అధికారి వెంట , జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, జిజీహెచ్ సుపరింటెండెంట్ డా. మాణిక్య రావు, జిజిహెచ్ వైద్యులు తదితరులు ఉన్నారు.

Add


Post a Comment

Previous Post Next Post