అసెంబ్లీకి మన నియోజకవర్గ బిడ్డ వంశిక.
ఏలూరు జిల్లా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
మాక్ అసెంబ్లీకి చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కనిపెడ వంశీక.
అసెంబ్లీకి వెళ్ళబోవుతున్న మన చిన్నారి వంశిక ను చింతలపూడి శాసన సభ్యుల వారి క్యాంపు కార్యాలయం లొ అభినందించిన శాసన సభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు,
ఈనెల 26న నిర్వహించే మాక్ అసెంబ్లీకి చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం, వేములపల్లి గ్రామానికి చెందిన వంశిక ఎంపికైంది. పాఠశాల, మండలం, నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో వంశీక ప్రతిభకనబరిచింది...
మన నియోజకవర్గం లింగపాలెం మండలం వేములపల్లి నుండి అసెంబ్లీలో మాక్ ఎమ్మెల్యేగా వెళ్లడం ఎంతో అభినందనీయం అని ప్రశంశించారు
మాక్ ఎమ్మెల్యేగా తన ప్రతిభను ఘనపరచాలని మరియు నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతలు తీస్కుని రావాలని దీవించారు,
ఈ కార్యక్రమం లొ విద్యాశాఖ అధికారులు, వేములపల్లి సర్పంచ్ నత్తా దివ్య దీప్తి, నాయకులు పాల్గొన్నారు.

