ప్రపంచ చేతులు శుభ్రంగా కడుక్కుందాం. గోడ పత్రికలు అవిష్కరించిన. కలెక్టర్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ రాజాబాబు రాష్ట్ర ప్రభుత్వము, యూనిసెఫ్ మరియు విజయ వాణి చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్తంగా గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ప్రాధాన్యతను వివరిస్తూ ముద్రించినటువంటి గోడ పత్రికలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ రాజబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరా శుభాకాంక్షలు వ్యక్తిగత శుభ్రతను కూడా పాటించాలని అందులో భాగంగా భోజనానికి ముందుగా తరువాత సూచించిన ప్రకారం ఏడు మార్గాల ద్వారా చేతులు శుభ్రంగా కడుకోవాలని తెలియజేశారు.
ముఖ్యమైన ఏడు సందర్భాలలో చేతులను కడుక్కోవడం అలవాటుగా చేసుకోవాలని తెలియజేశారు అందరూ భాగంగా దగ్గు లేదా తుమ్ము తర్వాత అనారోగ్య వ్యక్తికి సేవలు చేసే ముందు తర్వాత కలుషితమైన వివిధ ఉపరతలాలను తాకినప్పుడు బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆహారాన్ని తయారు చేసే ముందు తినడానికి ముందు మరుగుదొడ్డిని ఉపయోగించిన తరువాత మరియు చెత్త మరియు వ్యర్ధాలను పారవేసిన తరువాత తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా సురక్షితమైన జీవితాన్ని పొందవచ్చు అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డి ఆర్ డి ఓ ఓబులేష్,జిల్లా విద్యాధికారి కిరణ్ కుమార్,జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఉమన్ చైల్డ్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సువర్ణ, విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ కార్యక్రమం అధికారి టి రంగారావు, మరియు వాష్ ప్రోగ్రాం ప్రతినిధి కె మరియ బాబు పాల్గొన్నారు.
Add



