ఏలూరులో చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలు 3 వ రోజు.
* మెగాస్టార్ చిరంజీవి ఎందరికో స్ఫూర్తి ప్రదాత - రెడ్డి అప్పల నాయుడు
* వారోత్సవాల్లో భాగంగా ఆదివారపు పేట లోని రజకుల కమ్యునిటీ హాలులో మెగా రక్తదాన శిబిరం ఉచిత మెడికల్ క్యాంపు ప్రారంభం..
ఏలూరు, ఆగస్టు 17:- పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఏలూరు చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి.. సేవా స్ఫూర్తిని ప్రేరణగా తీసుకున్న చిరంజీవి యువత, మెగా అభిమానులు వారం రోజులపాటు వేరువేరు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. ఈ క్రమంలోనే ఆదివారం 46వ డివిజన్ ఆదివారం లో ఏలూరు చిరంజీవి యువత అధ్యక్షులు శానం శ్రీరామకృష్ణమూర్తి పర్యవేక్షణలో మెగా రక్తదాన శిబిరం మరియు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.. సుమారు 50 మందికి పైగా మెగా అభిమానులు రక్తదానం చేశారు.. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ మెగాస్టార్ సేవా గుణాన్ని స్ఫూర్తిగా తీసుకుని అభిమానులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శనీయమని అన్నారు.. ఈరోజు ఉచిత మెడికల్ క్యాంపు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన చిరంజీవి యువతను ప్రత్యేకంగా అభినందించారు.. చిరంజీవి గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. ఆగస్టు 22 వరకు ప్రతిరోజు ఒక వినూత్నమైన సేవా కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఆలోచనతో అభిమానులు ముందుకు రావడం సమాజానికి ఆదర్శం అని అన్నారు.. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటారు మెగా అభిమానులు.. సినీ రంగంలో మొదట సేవా భావాన్ని నాటిన వ్యక్తి చిరంజీవి.. ఆయనను ఆదర్శంగా తీసుకొని అభిమానులు ఈ మార్గంలో ముందుకు వెళ్తుండటం శుభ పరిణామం అని అన్నారు.. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అభిమానులు వెల్లడించారు.. కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షులు శానం శ్రీరామకృష్ణమూర్తి, పి.జగన్, సురేష్ మాస్టర్, ఈ.పవన్, దేవరపల్లి పెదబాబు, కట్టా ఆది, నరేష్, పండు నాయుడు, తుంపాల ఫణి, కోమాకుల శ్రీను, కరణం లోకేష్, లొట్టు రమేష్, రామ్ లక్ష్మణ్, డి.రాజు, శానం ఉదయ్ సాయి, దేవా బత్తుల అరవింద్, రోహిత్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.. ఏలూరులో మెగా అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు విశేషంగా చర్చనీయాంశమయ్యాయి..
Tags
latest news

.jpeg)