ఆర్మీ హవల్దార్ కు జిల్లా కలెక్టర్ ఘన నివాళులు.


 ఆర్మీ హవల్దార్ కు జిల్లా కలెక్టర్ ఘన నివాళులు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన కువ్వారపు కిషన్ ఆర్మీలో హవల్దార్ గా విధులు నిర్వహిస్తూ అస్సాం రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ నెల 27 వ తేదిన మరణించారు. ఈ నేపథ్యంలో స్వగ్రామం లో కిషన్ పార్దివ దేహానికి బుధవారం ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంతక్రియలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత , జిల్లా ఎస్పీ ఫంకజ్ కుమార్ మీనా, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, ఆర్మీ, అధికారులు పోలీస్ అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులు సిబ్బంది. మరియు గ్రామ ప్రజలు అంతక్రియల్లో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

 హవల్దార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా న్యాయం చేస్తామని వారికి భరోసా నిచ్చారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post