పూల సుబ్బయ్య వెలిగొండ నిర్వాసితులకు ధ్రువపత్రాల పరిశీలన, నిత్యావసర సరుకుల పంపిణీ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం మార్కెట్‌యార్డులో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిర్వాసితులలో 90 శాతం మందికి పరిహారం చెల్లించామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. మిగిలిన వారికి డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం బిల్లులు అప్లోడ్ చేస్తున్నామన్నారు. మేజర్ సన్స్, డాటర్స్‌కు రూ.2 లక్షలు, గజెట్లో మిస్ అయిన అర్హులకు రూ.12.50 లక్షలు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 11 గ్రామాల నిర్వాసితులు ఒరిజినల్ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. నిర్వాసితులకు రేషన్ కిట్లు, చీరలు, గాజులు, పశువులకు దాణా పంపిణీ చేసినట్లు తెలిపారు.
