30.80 లక్షలరూపాయలతో నూతన హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవంచేసిన ఎమ్మెల్యే ముత్తుముల.


30.80 లక్షలరూపాయలతో నూతన హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవంచేసిన ఎమ్మెల్యే ముత్తుముల.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

*మార్కాపురం జిల్లా గిద్దలూరు: రాచర్ల పట్టణంలో రూ.30.80 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన భారత్ నిర్మాణ్ సేవా కేంద్రం హెల్త్ సెంటర్‌ను గౌ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఈ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించి, అందుబాటులోకి తీసుకువచ్చారు.*

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అని అన్నారు నూతన హెల్త్ సెంటర్ ద్వారా రాచర్ల ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని తెలిపారు.* 

*కార్యక్రమంలో రాచర్ల మండల ప్రముఖులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.*

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post