రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం.


 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా కలెక్టర్ 

 విజయ సునీత ఆదేశం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో రవాణా, పోలీసు, ఆర్టీసీ, నేషనల్ హైవే, ఆర్ అండ్ బి , వైద్య ఆరోగ్య, మున్సిపల్ శాఖ అధికారులతో 'జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం' నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి మరోసారి అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రోడ్ల వెంట వాహనాలు నిలుపుదల చేయకుండా చూడాలన్నారు. అదేవిధంగా కంభం, గిద్దలూరు, కుంట, బేస్తవారిపేట తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. దీంతోపాటు ఆర్టీసీ బస్సుల్లో బ్రేక్ డౌన్ కాకుండా సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. సంబంధిత అన్ని శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు కృషి చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి రాంబాబు, డీఎస్పీ నాగరాజు, ఆర్టీసీ డిఎం లావణ్య, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, వివిధ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post